#SSMB24 First Oath

https://m.facebook.com/story.php?story_fbid=2059978534238211&id=1374375156131889

Advertisements

Mahesh Stunning Pre look in #Mahesh23

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. షూటింగ్‌ మొదలై చాలాకాలం అయినా కూడా ఇంతవరకు ఫస్ట్‌లుక్‌గానీ, టీజర్‌గాని విడుదల కాలేదు. దాంతో ఈ చిత్రంలో మహేష్‌ లుక్‌ ఎలా ఉంటుందో అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తామని దర్శకుడు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. కాని ఈ చిత్ర టైటిల్‌ను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. టైటిల్స్‌గా చాలాపేర్లే వినిపించినా కూడా చిత్ర యూనిట్‌ మాత్రం ఏ టైటిల్‌ను ఇంకా ఫిక్స్‌ చేయలేదు.

mahesh-babu

 

టైటిల్‌ ఖరారు కాకపోవడం వల్లనే ఫస్ట్‌లుక్‌ను కూడా ఇంకా విడుదల చేయలేదు. త్వరలో టైటిల్‌ ఫిక్స్‌ చేసి ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా ఒకేసారి విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. అంతేకాకుండా వెంటనే చిత్ర టీజర్‌ను కూడా విడుదల చేస్తారట. టీజర్‌ కోసం 30లక్షలు ఖర్చు చేసి మరీ లండన్‌ నిపుణుల చేత హంగులు దిద్దుతున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ప్రీలుక్‌లో చాలా సీరియస్‌గా, పవర్‌ఫుల్‌ లుక్‌తో సూపర్‌స్టార్‌ అదరగొడుతున్నాడు. ప్రీ లుక్‌ చూశాక అభిమానులు ఫస్ట్‌లుక్‌ కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

M.S DHONI – UNTOLD STORY REVIEW

Review : M.S.Dhoni – A ‘Well’ Told Story!